Kondapur: ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
Kondapur: కొండాపూర్ ఏరియా ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. జీవో 6 ప్రకారం రూ.26 వేల వేతనం చెల్లించాలని కోరారు.
Kondapur: ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కొండాపూర్: కొండాపూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్‌కేర్, సెక్యూరిటీ విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (AITUC) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఎం. నర్సింహ్మ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించారు.
జీవో నెం. 6 ప్రకారం అనుభవజ్ఞులైన కార్మికులకు నెలకు రూ. 26,000 వేతనం చెల్లించాలని, ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే నవంబర్ 12 నుంచి నిరసన ధర్నాలు చేపట్టి, నవంబర్ 28 నుంచి సమ్మెకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు.




