Appareddyguda: ఖేత్ బచావో అభియాన్: అప్పారెడ్డిగూడలో రైతు సదస్సు
Appareddyguda: ఐసీఏఆర్–నార్మ్ ఆధ్వర్యంలో అప్పారెడ్డిగూడలో ఖేత్ బచావో అభియాన్ సదస్సు నిర్వహించి మట్టి పరీక్షలు, సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
Appareddyguda: ఖేత్ బచావో అభియాన్: అప్పారెడ్డిగూడలో రైతు సదస్సు
Appareddyguda: ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఐసీఏఆర్–నార్మ్ (ICAR-NAARM) ఆధ్వర్యంలో అప్పారెడ్డిగూడ గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పోలేపల్లి సందీప్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మట్టి నాణ్యత పరీక్ష, సేంద్రియ వ్యవసాయం, ఎరువుల వినియోగంపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రైతుల పొలాల్లో మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి, భూసారానికి అనుగుణంగా పంటల సాగు, ఎరువుల వినియోగంపై తగిన సూచనలు అందించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రానున్న రబీ సీజన్‌లో సాగు చేయాల్సిన పంటలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ సేంద్రియ పద్ధతుల ద్వారా భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు.
అనంతరం గ్రామ రైతులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు డాక్టర్ మహంతేష్ శిరూర్, డాక్టర్ లక్ష్మణ్ అహిరే, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




