Khairatabad: ఖైరతాబాద్‌లో రాజుకున్న రాజకీయం పల్లపు గోవర్ధన్ ఆత్మీయ సమ్మేళనం!
Khairatabad: ఖైరతాబాద్‌లో పెరిగిన పొలిటికల్ హీట్. సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Khairatabad: ఖైరతాబాద్‌లో రాజుకున్న రాజకీయం పల్లపు గోవర్ధన్ ఆత్మీయ సమ్మేళనం!
Khairatabad: ఖైరతాబాద్ నియోజకవర్గం లో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతున్నది. దానం నాగేందర్ ఎమ్మెల్యే ఎన్నిక రద్దు చేస్తూ తీర్పు వెలువడిన నేపథ్యం లో నేతలంతా అలర్ట్ అయ్యారు. తాజాగా బంజారాహిల్స్ లో ఖైరతాబాద్ సీనియర్ నేత, భాగ్యనగర్ ఉత్సవ సమితి కార్యదర్శి పల్లపు గోవర్ధన్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం రాజకీయ పార్టీల్లో చర్చనియాంశం అయ్యింది. సుమారు 2 వేల మంది నియోజక వర్గ ప్రజలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పల్లపు గోవర్ధన్ నిర్వహించిన ఈ సమ్మేళనం లో పాల్గొన్నారు తెలంగాణ రాజకీయాల్లో యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, రానున్న ఎన్నికలో యువత కీలక పాత్ర పోషించనున్నారని పల్లపు గోవర్ధన్ పేర్కొన్నారు.
ఖైరతాబాద్నియోజక వర్గం సమస్యల పరిష్కారంతో పాటు హైందవ శక్తులను ఒక్కతాటి మీదకు తెచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. యువత అభ్యున్నతి, బస్తీల అభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రవర్ణాల పేదల అభ్యున్నతి తమ లక్ష్యంగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని, ఖైరతాబాద్
నియోజక వర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లో తాము ఎవరి పక్షాన నిలబడాలనేది త్వరలోనే చెప్తామని, అన్ని వర్గాల ప్రజలు, యువత, మహిళల తో, శ్రేయోభిలాషుల తో చర్చించి త్వరలోనే తాను నిర్ణయం తీసుకుంటానని పల్లపు గోవర్ధన్ తెలిపారు.




