Khairatabad: పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి: మన్నె గోవర్ధన్ రెడ్డి!

Khairatabad: హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రేమ్‌నగర్‌లో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తులను బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి పంపిణీ చేశారు.

RAJESH,	WEST ZONE
Published on: 1 Nov 2026 4:07 PM IST
Khairatabad
X

Khairatabad: పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి: మన్నె గోవర్ధన్ రెడ్డి!

ఖైరతాబాద్: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలనే లక్ష్యంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్‌లో పట్టభద్రులకు ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇన్చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో MGR మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి అర్హుడైన పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా ముందుగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఓటరు నమోదు కోసం సమయం తక్కువగా ఉన్నందున నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లోనూ నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు నమోదు దరఖాస్తులను వెంటనే సమర్పించాలని కోరారు.

పట్టభద్రుల సమస్యలు, హక్కులు మరియు ఆకాంక్షలను చట్టసభలో బలంగా వినిపించేందుకు ప్రతి ఓటు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామ ప్రభాకర్ రెడ్డి, రావుల విజయ్ కుమార్, శ్రీధర్ యాదవ్, G. పద్మ, R. పద్మ, సావిత్రి, రాములమ్మ, రామయ్య, శంకర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE