Keesara: కీసరలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం

Keesara: కీసర డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ సోమవారం ఘనంగా ప్రారంభించారు.

ASHOK, KAPRA
Published on: 21 Sept 2026 6:54 PM IST
Keesara
X

Keesara: కీసరలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం

Keesara: కీసర డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు, మేడ్చల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రెష్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించి, నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్‌ యాదవ్‌ మాట్లాడుతూ,.. నూతన పార్టీ కార్యాలయం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వేదికగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటి పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కీసర డివిజన్‌లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.

ఎన్నికల్లో విజయం లక్ష్యంగా..

కీసర డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు రామిడి స్వప్న విజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. కీసర డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. రానున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తామని పేర్కొన్నారు. నూతన కార్యాలయం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ స్థానిక సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్‌గౌడ్‌, డీసీసీ కమిటీ సభ్యులు బక్కని నర్సింగ్‌రావు, పంగ హరిబాబు, దమ్మాయిగూడ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ముప్ప రామారావు, జిల్లా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింహులు యాదవ్‌,జిల్లా ఆర్టీయే సభ్యులు భీమిడి జైపాల్ రెడ్డి,మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు వేణు, ఈగ శ్వేతా ముదిరాజ్‌, మాజీ మండల అధ్యక్షులు తటాకం వెంకటేష్‌, మొరుగు ముత్యాలు, కోల కృష్ణ యాదవ్‌, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు పిన్నింటి కృష్ణారెడ్డి, మేడ్చల్‌ నియోజకవర్గ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఖాజా మొయినుద్దీన్‌, డివిజన్‌ అధ్యక్షుడు అన్వర్‌ పాషా, సహకార సంఘం బ్యాంక్‌ వైస్‌ చైర్మన్ పన్నాల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలాగే కీసర డివిజన్‌ కాంగ్రెస్‌ నాయకులు, మహిళా కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA