Keesara: కీసర సర్కిల్ పరిధిలో 2,500 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ

Keesara: కీసర సర్కిల్ పరిధిలో 2,500 మందికి నూతన చేయూత పింఛన్ల ఉత్తర్వులను ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి దమ్మాయిగూడలో పంపిణీ చేశారు.

PURENDAR, ALWAL
Published on: 17 Nov 2026 6:57 PM IST
Keesara
X

Keesara: కీసర సర్కిల్ పరిధిలో 2,500 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ

కీసర: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని దమ్మాయిగూడలోని సాయి భవాని ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. కీసర సర్కిల్ పరిధిలో నూతనంగా ఎంపికైన సుమారు 2,500 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు ఉత్తర్వులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు పింఛన్ మంజూరు ఉత్తర్వులను అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, సంక్షేమ పథకాల ద్వారా వారి జీవితాల్లో భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు శాంతి కోటేష్ గౌడ్, స్థానిక నాయకులు కారింగుల శంకర్ గౌడ్, గొడుగు వేణు, రజిత గోపాల్, మాట్లా శ్రీనివాస్, బూడిద వెంకటేష్, చిట్టి బాబు, కారింగుల రాజు గౌడ్, మంజుల, సుగుణ, కాలేశా, రేసు లక్ష్మీ, సరిత, భాస్కర్, రాహుల్ కదం, బబ్లూ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL