LB Nagar: ఎల్బీనగర్‌లో కల్వకుంట్ల కవిత బతుకమ్మ ఆటపాటలు!

LB Nagar: ఎల్బీనగర్ హస్తినాపురంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కవిత, సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించాలని, యువత సాంప్రదాయ పాటలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 11 Oct 2026 7:04 AM IST
LB Nagar
X

LB Nagar: ఎల్బీనగర్‌లో కల్వకుంట్ల కవిత బతుకమ్మ ఆటపాటలు!

LB Nagar: మన పండుగలను, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎల్బీనగర్ హస్తినాపురం లోని డీఆర్డీఎల్ కాలనీ వాసులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడి సందడి చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మనదని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువత సంప్రదాయ బతుకమ్మ పాటలను నేర్చుకోవాలని సూచించారు. ఒక్కసారి పాట నేర్చుకుంటే అది వందేళ్ల పాటు నిలిచిపోతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం డీజే పాటలు ఉన్నప్పటికీ, సంప్రదాయ బతుకమ్మ పాటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మహిళలు ఆనందంగా బతుకమ్మ ఆడుకునేందుకు డీఆర్డీఎల్ కాలనీలో అద్భుతమైన ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. ఇదే సంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని కోరారు.

పండుగలకు పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకోవాలని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాలని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR