Kapra: కాప్రాలో వీరశైవ సమాజం కార్తీక వనభోజనాలు, ఎమ్మెల్యే హాజరు

Kapra: కాప్రా విజయ హైస్కూల్‌లో వీరశైవ సమాజం కార్తీక మాస వనభోజనాలకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. వీరశైవుల అభ్యున్నతికి సహకరిస్తామని హామీ.

ASHOK, KAPRA
Published on: 29 Nov 2026 7:08 PM IST
Kapra
X

Kapra: కాప్రాలో వీరశైవ సమాజం కార్తీక వనభోజనాలు, ఎమ్మెల్యే హాజరు

కాప్రా: వీరశైవుల అభ్యున్నతికి తనవంతు సహకారం అందిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం కాప్రాలోని విజయ హైస్కూల్‌లో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సామూహిక కార్యక్రమాల వల్ల సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందుతాయని, మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి వేడుకలు దోహదపడతాయని పేర్కొన్నారు. తొలుత శివాభిషేకం, శివార్చన నిర్వహించారు. అనంతరం సభా కార్యక్రమాలతో పాటు మిమిక్రీ, మ్యాజిక్‌ షో వంటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం నిర్వహించిన వనభోజనాల్లో వీరశైవులు, అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వీరశైవ సమాజం గౌరవ అధ్యక్షులు యావపురం విశ్వనాథం, అధ్యక్షులు పేట జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి గంగా ఈశ్వరయ్య, కోశాధికారి కత్తి శివానంద, మాజీ అధ్యక్షుడు బండే గౌడ, మాజీ కార్పొరేటర్లు పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్ బొంతు శ్రీదేవి యాదవ్ నాయకులు గంప కృష్ణ, రాములు యాదవ్, విజయ హై స్కూల్ కరస్పాండెంట్ కొప్పునూరు రాజేశ్వర్, ఈశ్వర్ ప్రసాద్, వంజరి ప్రవీణ్, సారా అనిల్, సురేందర్ రావు, మెరుగు చంద్రమోహన్, అశోక్, వెంకట్, పవన్, ముఖేష్, రవి, రమేష్, మస్కరి శివ, శశికుమార్, టీ. ప్రకాష్ సాయి, జగదీష్, వీరేశం, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని వీరశైవ సమాజం కాప్రా ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA