Kapra: సాయి-సుధీర్ కళాశాలలో మానసిక ఆరోగ్యంపై అవగాహనా సదస్సు
Kapra: కాప్రా ఈసీఐఎల్ సాయి-సుధీర్ కళాశాలలో మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఇన్‍బ్లిస్ క్లినికల్ సైకాలజిస్టులు పాల్గొన్నారు.
Kapra: సాయి-సుధీర్ కళాశాలలో మానసిక ఆరోగ్యంపై అవగాహనా సదస్సు
కాప్రాL కాప్రా సర్కిల్ పరిధిలోని ఈసీఐఎల్ లో ని సాయి-సుధీర్ డిగ్రీ & పీజీ కళాశాలలో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సమతుల్యత, రోజువారీ జీవితంలో ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవడంపై అవగాహన కల్పించేందుకు “దైనందిన జీవితంలో మనస్తత్వశాస్త్రం: ఆలోచనలు, భావోద్వేగాలు మరియు ప్రవర్తన” అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇన్‌బ్లిస్ మెంటల్ వెల్‌నెస్ సెంటర్;
InBliss Mental Wellness Centre; వ్యవస్థాపకురాలు, శ్రావ్య రాగ, సాయిరాం రామావత్, క్లినికల్ సైకాలజిస్ట్ శివాంగి, క్లినికల్ సైకాలజిస్ట్ పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తూ, అతిగా ఆలోచించడం, ప్రతికూల ఆలోచనలు, ఆత్మవిశ్వాస లోపం, స్వీయ అవగాహన, భావోద్వేగ నియంత్రణ, నిర్ణయాలు తీసుకోవడంలో ఎదురయ్యే సవాళ్లు, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
కళాశాల చైర్ పర్సన్ డా. ఆర్. ఉషారాణి విద్యార్థులకు ఈ సదస్సులో నేర్చుకున్న మానసిక పద్ధతులను తమ దైనందిన జీవితంలో ఆచరిస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలని, ప్రతికూల ఆలోచనలను అధిగమించి సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది, మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సంపూర్ణ వికాసం, మానసిక ఆరోగ్యం, భావోద్వేగ శ్రయస్సుకు ప్రధాన్యత నిస్తూ సాయి-సుధీర్ కళాశాల చేపడుతున్న కార్యక్రమాల్లో ఈ సదస్సు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది.




