Kapra: కాప్రా చెరువులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Kapra: కాప్రా చెరువు వద్ద సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ అధికారుల ముందస్తు ఏర్పాట్లపై కన్వీనర్ సుడుగు మహేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

ASHOK, KAPRA
Published on: 18 Oct 2026 9:55 PM IST
Kapra
X

Kapra: కాప్రా చెరువులో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కాప్రా: కాప్రా చెరువు వద్ద సద్దుల బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా, అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆటపాటలతో చెరువు ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపి వేశారు.

కాప్రా చెరువు బతుకమ్మ ఉత్సవాల కన్వీనర్ సుడుగు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కాప్రా సర్కిల్ మున్సిపల్ అధికారులు పండుగ ప్రాంగణంలో విద్యుత్ దీపాల అలంకరణ (లైటింగ్), సౌండ్ సిస్టమ్ మౌలిక వసతులను ఏర్పాటు చేశారు.

ఘాట్ల వద్ద కల్పించిన వసతులు, నిమజ్జన ప్రక్రియలో మున్సిపల్ సిబ్బంది అందించిన సేవలు, చేపట్టిన ముందస్తు ఏర్పాట్లపై కాలనీవాసులు, భక్తులు మున్సిపల్ అధికారులకు కాప్రా చెరువు బతుకమ్మ వేడుకల కన్వీనర్ సుడుగు మహేందర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA