Kapra: జవహర్ నగర్‌లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
Kapra: కాప్రా మండలం జవహర్ నగర్‌లోని సర్వే నంబర్లలో ప్రభుత్వ భూముల ఆక్రమణలను తహసీల్దార్ మతిన్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు జేసీబీతో కూల్చివేశారు.
Kapra: జవహర్ నగర్‌లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
కాప్రా: కాప్రా మండల పరిధిలోని జవహర్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు వచ్చిన సమాచారం మేరకు గురువారం రెవెన్యూ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు గిర్దావర్ సత్యనారాయణ సమక్షంలో సర్వే నంబర్లు 600, 611, 696, 821 పరిధిలోని వికలాంగుల కాలనీ, బీరప్పగడ్డ, మోహన్ రావు కాలనీల్లో జేసీబీ సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మతిన్ మాట్లాడుతూ.. జవహర్ నగర్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
అంతేకాకుండా ప్రభుత్వ భూములను అమాయక పేద ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, అటువంటి వారిని గుర్తించి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యంగా రెవెన్యూ శాఖ పనిచేస్తోందని, జవహర్ నగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని తహసీల్దార్ హెచ్చరించారు. ఈ కూల్చివేత కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.




