Kapra: పల్లే ప్యారడైస్‌లో ₹3.23 లక్షలు పలికిన గణపతి లడ్డూ
Kapra: కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని పల్లే ప్యారడైస్ కాలనీ గణపతి లడ్డూను బాకారం గోవర్ధన్ రెడ్డి రూ.3,23,000లకు వేలంలో దక్కించుకున్నారు.
Kapra: పల్లే ప్యారడైస్‌లో ₹3.23 లక్షలు పలికిన గణపతి లడ్డూ
Kapra: కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ లోని పల్లే ప్యారడైస్ కాలనీలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన గణేశుని లడ్డూ వేలంలో కాలనీ వాస్తవ్యులు బాకారం గోవర్ధన్ రెడ్డి రూ. 3,23,000 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు.
వేలం అనంతరం కాలనీ వాసులు హర్షధ్వానాల మధ్య గణేశుని లడ్డూను గోవర్ధన్ రెడ్డి కి అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాలనీ వాసులందరూ వినాయక విగ్రహంతో ఊరేగింపుగా వెళ్లి, భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.




