Kapra: జవహర్ నగర్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేత

Kapra: జవహర్ నగర్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన కాప్రా రెవెన్యూ యంత్రాంగం. ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పువని తహసీల్దార్ మతిన్ హెచ్చరిక.

PURENDAR, ALWAL
Published on: 22 Oct 2026 9:44 PM IST
Kapra
X

Kapra: జవహర్ నగర్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేత

కాప్రా: కాప్రా మండల పరిధి జవహర్ నగర్ లో ని సర్కారు భూముల్లో అక్రమంగా నిర్మాణాలు జరిగాయనే సమాచారం మేరకు... కాప్రా తహసీల్దార్ మతిన్ ఆదేశాల మేరకు గిర్దావర్ సత్యనారాయణ సమక్షంలో గురువారం పలు అక్రమ కట్టడాలను కూల్చివేశాము.

వికలాంగుల కాలనీలొ రెండు రూములు, బీరప్ప గడ్డలొ రెండు రూములు, సేవా లాల్ తండాలో రూములు, లక్ష్మీ నరసింహా కాలనీలొ ఒకటి రూము లో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను జేసీబీ సాయంతో కూల్చివేశాము. ఈ సందర్భంగా తహసీల్దార్ మతిన్ మాట్లాడుతూ జవహర్ నగర్ లోని ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, కబ్జాదారులు కట్టడాలు చేస్తూ సహించేదే లేదని హెచ్చరించారు.

సర్కారు భూములను అమాయక పేదలకు అమ్ముతు సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై ప్రత్యేక నజర్ పెట్టామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ భూముల రక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, జవహర్ నగర్ ప్రాంతంలోని భూముల్లో ఎలాంటి కట్టడాలు చేపట్టరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL