Kapra: జమ్మిగడ్డ కాలనీ సమస్యలపై సర్కిల్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ ధర్నా

Kapra: జమ్మిగడ్డ న్యూ శ్రీనివాస్ నగర్ కాలనీ సమస్యలపై కాప్రా సర్కిల్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ ధర్నా. డీసీ రవీంద్ర సాగర్‌కు వినతిపత్రం అందజేసిన కొత్త అంజిరెడ్డి.

ASHOK, KAPRA
Published on: 29 Oct 2026 5:52 PM IST
Kapra
X

Kapra: జమ్మిగడ్డ కాలనీ సమస్యలపై సర్కిల్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ ధర్నా

కాప్రా: జమ్మిగడ్డ న్యూ శ్రీనివాస్‌ నగర్‌ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సర్కిల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. డాక్టర్‌ ఏఎస్‌ రావు నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో నాయకులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కాలనీ ప్రజల సౌకర్యార్థం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎవరికీ ఇబ్బంది కలగని స్థలంలో నిర్మించిన నీటి తొట్టెను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడం అన్యాయమని ఆందోళనకారులు పేర్కొన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే అనుచరుడి అండతో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఇంటిని తొలగించాలని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ప్రజా సమస్యలపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమని, వారి మొండి వైఖరితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అంజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు మారకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

అనంతరం కాప్రా సర్కిల్ డిసి రవీంద్ర సాగర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఏ అల్లురయ్య, న్యూ శ్రీనివాస నగర్ కాలనీ ప్రెసిడెంట్ సుబెదర్ రహంతుల్లా, వైస్ ప్రెసిడెంట్ పీవీవి సత్య నారాయణ, విజయ లక్ష్మి, అడ్వైసర్ ఆనంద్, శ్రీను, సింగం నరసింహ పటేల్, పుష్ప, భవాని, జనరల్ సెక్రటరీ బి ప్రవీణ్ కుమార్ బోయంకర్, ఏన్ శేఖర్, జానీ షేక్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA