Kapra: కాప్రా ఆర్‌కే ఎన్‌క్లేవ్‌లో పర్యటించిన బైరి నవీన్ గౌడ్!

Kapra: కాప్రా డివిజన్ ఆర్‌కే ఎన్‌క్లేవ్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బైరి నవీన్ గౌడ్ పర్యటన. రూ.50 లక్షలతో సీసీ రోడ్ల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు.

ASHOK, KAPRA
Published on: 7 Oct 2026 2:38 PM IST
Kapra
X

Kapra: కాప్రా ఆర్‌కే ఎన్‌క్లేవ్‌లో పర్యటించిన బైరి నవీన్ గౌడ్!

Kapra: కాప్రా డివిజన్‌లోని ఆర్‌కే ఎన్‌క్లేవ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కాప్రా డివిజన్ అధ్యక్షుడు బైరి నవీన్ గౌడ్ పర్యటించి, కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.కాలనీ అభివృద్ధికి రూ.50 లక్షలతో CC రోడ్ల పనులు మంజూరు చేయించినందుకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని కలిసి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం నవీన్ గౌడ్ కాలనీలో పర్యటిస్తూ స్టార్మ్ వాటర్ డ్రైనేజీ సమస్యలు, మిగిలిన రోడ్ల పనులు, వాటర్ లైన్ అవసరం మరియు ఇతర మౌలిక వసతుల సమస్యలను పరిశీలించారు.

ఈ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA