Kandukur: గఫూర్ నగర్‌లో భూముల రీసర్వేపై గ్రామసభ.. RDO సూచనలు
Kandukur: కందుకూరు మండలం గఫూర్ నగర్ గ్రామంలో భూముల సమగ్ర రీసర్వేపై ఆర్డీఓ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. రైతుల భూ హక్కుల పరిరక్షణకు రీసర్వే కీలకమని తెలిపారు.
Kandukur: గఫూర్ నగర్‌లో భూముల రీసర్వేపై గ్రామసభ.. RDO సూచనలు
కందుకూరు: మండలంలోని గఫూర్ నగర్ గ్రామంలో భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశానికి కందుకూరు RDO అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల భూ హక్కుల పరిరక్షణకు రీసర్వే ఎంతో కీలకమని తెలిపారు. భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఉపవిభాగాల వివరాలను ఖచ్చితంగా గుర్తించి భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించనున్నట్లు వివరించారు.
రీసర్వే ద్వారా భూ వివాదాలు తగ్గడంతో పాటు భూముల కొనుగోలు, అమ్మకాలు, వారసత్వ హక్కులు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల అమలులో స్పష్టత ఏర్పడుతుందని పేర్కొన్నారు. సర్వే బృందాలు గ్రామానికి వచ్చినప్పుడు రైతులు తమ భూముల వద్ద హాజరై వాస్తవ హద్దులను చూపిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, డీటీ శేఖర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే రామకాంత్ రెడ్డి, మండల సర్వేయర్ సాయికాంత్, సర్పంచ్ కృష్ణ, ఉపసర్పంచ్ రవికుమార్ రెడ్డి, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




