Kalwakurthy: కేశవ నగర్‌లో సుంకిరెడ్డి సొంత నిధులతో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు!

Kalwakurthy: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ కేశవ నగర్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సొంత నిధులతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 17 Nov 2026 10:16 AM IST
Kalwakurthy
X

Kalwakurthy: కేశవ నగర్‌లో సుంకిరెడ్డి సొంత నిధులతో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు!

కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని కేశవ నగర్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తన సొంత నిధులతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించారు. రాత్రివేళల్లో సరైన వెలుతురు లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి ఆయన ఈ సహకారం అందించారు.

హైమాస్ట్ లైట్ల ఏర్పాటుతో కాలనీలో రాత్రివేళల్లో రాకపోకలకు సౌకర్యం కలగడంతో పాటు మహిళలు, వృద్ధులకు భద్రత పెరుగుతుందని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలకు స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రామకృష్ణ, బీజేవైఎం అధ్యక్షుడు నరేష్ చారి, కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, శ్రీనివాస్, వరప్రసాద్, రాఘవాచారి, రాములు, సత్యనారాయణ, విశ్వనాథం, అనంత రాములు, చెన్నయ్య, నరసింహ, బాలు, రామ్మోహన్, లక్ష్మణ్ గౌడ్, శేఖర్, ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY