Kalwakurthy: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌కు పరామర్శ!

Kalwakurthy: కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌ను ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 28 Oct 2026 5:10 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌కు పరామర్శ!

కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌ను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం పరామర్శించారు. శేఖర్ నివాసానికి వెళ్లిన వారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కావడంతో పాటు కాలు ఫ్రాక్చర్ అయిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ శేఖర్‌కు రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మండల పార్టీ అధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సాహెద్, మాజీ ఉపసర్పంచ్ నిరంజన్, కౌన్సిలర్ రాములు, జిల్లా నాయకులు నాగులు నాయక్, మాజీ సర్పంచ్ అంజి నాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు జోగయ్య, వార్డు సభ్యులు నరేష్, కిషోర్, ప్రవీణ్, బుచ్చిబాబు, జంగిర్, నగేష్, రామకృష్ణ, బర్కం గణేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY