Ranga Reddy: ఆమనగల్‌లో సింగిల్ విండో డైరెక్టర్ కాలే మల్లయ్యకు ఘన సన్మానం!
Ranga Reddy: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలో సింగిల్ విండో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కాలే మల్లయ్యను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
Ranga Reddy: ఆమనగల్‌లో సింగిల్ విండో డైరెక్టర్ కాలే మల్లయ్యకు ఘన సన్మానం!
Ranga Reddy: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలో సింగిల్ విండో డైరెక్టర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టిన కాలే మల్లయ్యను యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కాలే మల్లయ్యను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో ఆయన మరిన్ని సేవలందిస్తూ సహకార రంగం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మండ్లి రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంగలి ప్రసాద్, బాబా, కొండల్‌రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ ఫరీద్, మహేష్, ఫిరోజ్, రాఘవేందర్, హరిలాల్, దేవరశెట్టి మహేష్, పూసల వెంకటేష్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.




