Kadthal: ఆలయ అభివృద్ధికి రూ.3 లక్షల చెక్కు అందజేసిన రాఘవేందర్ రెడ్డి
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సాలార్పూర్ తండా శివరామాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రూ.3 లక్షలు అందజేశారు.
Kadthal: ఆలయ అభివృద్ధికి రూ.3 లక్షల చెక్కు అందజేసిన రాఘవేందర్ రెడ్డి
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సాలార్పూర్ తండాలో నిర్మాణంలో ఉన్న శ్రీ శివరామాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు. ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షలు అందిస్తానని గతంలో ఇచ్చిన హామీ మేరకు శనివారం తొలి విడతగా రూ.3 లక్షల చెక్కును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. మిగిలిన రూ.2 లక్షలు కూడా త్వరలో అందిస్తానని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, గ్రామాల్లో ఐక్యత, భక్తిభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం వాసుదేవ్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ నగర్ తండాలో శ్రీ తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు ప్రియా రమేష్, కేతావత్ రమేష్ నాయక్, అమర్ సింగ్, ఉపసర్పంచులు మహేశ్వరి కుమార్, ఎర్ర రామకృష్ణ, రమేష్, మాజీ సర్పంచ్ శంకర్, నాయకులు మోహన్, పకీర, జగన్, పాండు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.




