Kadthal: సాయిరాం కాలనీ వాసుల 30 ఏళ్ల కల సాకారం: సీసీ రోడ్డు పనులు షురూ
Kadthal: కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కడ్తాల్ సాయిరాం కాలనీలో హెచ్‌ఎండీఏ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి.
Kadthal: సాయిరాం కాలనీ వాసుల 30 ఏళ్ల కల సాకారం: సీసీ రోడ్డు పనులు షురూ
కడ్తాల్: కడ్తాల్ మండల కేంద్రంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కడ్తాల్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిక్షపతి ఆధ్వర్యంలో సాయిరాం కాలనీలో హెచ్‌ఎండీఏ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి వేగవంతం చేశారు.
గత 30 సంవత్సరాలుగా రోడ్డు కోసం ఎదురుచూస్తున్న కాలనీవాసుల చిరకాల వాంఛ నెరవేరడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ బిక్షపతి, వార్డు సభ్యులను అభినందించారు.
గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పార్లమెంటు సభ్యులకు సర్పంచ్, వార్డు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఎమ్మెల్యే చేతుల మీదుగా రోడ్డును ప్రారంభిస్తామని సర్పంచ్ బిక్షపతి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, రేవంత్ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షుడు చందోజీ, వార్డు సభ్యులు దేవరకొండ మల్లయ్య, విజయ్, పంచాయతీ కార్యదర్శి అల్లాజీ, క్యామ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.




