Kadthal: కడ్తాల్‌లో 5.935 కిలోల గంజాయి పట్టివేత.. నిందితుడి రిమాండ్!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి శివారులో బుధవారం తనిఖీలు నిర్వహించిన పోలీసులు 5.935 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 Nov 2026 7:16 PM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్‌లో 5.935 కిలోల గంజాయి పట్టివేత.. నిందితుడి రిమాండ్!

రంగారెడ్డి జిల్లా, కడ్తాల్: గంజాయి అక్రమ రవాణాపై కడ్తాల్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం కడ్తాల్ మండలం మైసిగండి గ్రామ శివారులోని ఎంఆర్‌జీ గార్డెన్ సమీపంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 5.935 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

కడ్తాల్ ఎస్‌ఐ బి. చంద్రశేఖర్‌కు అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో యమహా ఫాసినో ద్విచక్ర వాహనంపై గంజాయిని తరలిస్తున్న నల్గొండ జిల్లా లోక్యా తండాకు చెందిన ధనావత్ వెంకటేష్ (26)ను అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగును తనిఖీ చేయగా ఐదు కవర్లలో 5.935 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయితో పాటు మొబైల్‌ఫోన్, ద్విచక్ర వాహనం, బ్యాగు, డిజిటల్ వెయింగ్ మెషీన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితుడు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. దీంతో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా కడ్తాల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వి. సైదిరెడ్డి మాట్లాడుతూ గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY