Kadtal: బీఆర్ఎస్ నేత నరసింహ సతీమణిని పరామర్శించిన ఎడ్మ సత్యం

Kadtal: కడ్తాల్ సీనియర్ బీఆర్ఎస్ నేత మంగళపల్లి నరసింహ సతీమణి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, దశరథ్ నాయక్ తదితరులు పరామర్శించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 8 Oct 2026 9:28 PM IST
Kadtal
X

Kadtal: బీఆర్ఎస్ నేత నరసింహ సతీమణిని పరామర్శించిన ఎడ్మ సత్యం

రంగారెడ్డి జిల్లా: కడ్తాల్‌కు చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మంగళపల్లి నరసింహ సతీమణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కాళ్లు, చేతులు పడిపోయి మంచానికే పరిమితమయ్యారు.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు గురువారం మంగళపల్లి నరసింహ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారిలో కడ్తాల్ మాజీ జడ్పీటీసీ, రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్పుల దశరథ్ నాయక్, కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం. మాజీ ఎంపీపీ ఆనంద్ మాజీ ఉపసర్పంచ్ కడారి రామకృష్ణ ఉన్నారు.వీరు బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా నేతలు భరోసా ఇచ్చారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY