Shabad: రేడియల్ రోడ్డు రైతులకు న్యాయం చేయాలి: మధుసూదన్ రెడ్డి

Shabad: షాబాద్ మండలం సంకేపల్లిగూడలో రేడియల్ రోడ్డు భూ సేకరణ రీ-సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని మంత్రి శ్రీధర్ బాబును మధుసూదన్ రెడ్డి కోరారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 25 Sept 2026 2:27 PM IST
Shabad
X

Shabad: రేడియల్ రోడ్డు రైతులకు న్యాయం చేయాలి: మధుసూదన్ రెడ్డి

Shabad: షాబాద్ మండలంలోని సంకేపల్లిగూడ గ్రామ రైతులు రేడియల్ రోడ్డు నిర్మాణం కారణంగా తమ భూములను కోల్పోతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి గారు తెలిపారు.

రేడియల్ రోడ్డు కోసం భూముల సేకరణలో భాగంగా రైతుల భూముల కొలతలు, సరిహద్దుల విషయంలో స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సంకేపల్లిగూడ గ్రామ పరిధిలో భూములను సమగ్రంగా రీ-సర్వే చేయించాలని కోరుతూ ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్ బాబును కలిసి రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

రైతులకు నష్టం కలగకుండా క్షుణ్ణంగా పరిశీలించి రీ-సర్వే నిర్వహించాలని, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు గారిని మధుసూదన్ రెడ్డి గారు కోరారు. రైతుల సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA