Khairatabad: ఖైరతాబాద్ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్!

Khairatabad: ఖైరతాబాద్‌లో నవయుగ యాదవ్ సంఘం నిర్వహించిన సదర్ సమ్మేళన వేడుకలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హాజరై, యాదవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

RAJESH,	WEST ZONE
Published on: 10 Nov 2026 12:49 PM IST
Khairatabad
X

Khairatabad: ఖైరతాబాద్ సదర్ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్!

Khairatabad: ఖైరతాబాద్‌లో నవయుగ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళన వేడుకలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా యాదవ సోదరులతో కలిసి సదర్ వేడుకల్లో పాల్గొని, వారి సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతను ప్రతిబింబించే ఉత్సవాల్లో భాగస్వాములయ్యారు. యాదవ సోదరులతో ఆత్మీయంగా ముచ్చటించి, వారికి సదర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో యాదవ సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE