Shadnagar: గణేష్ లడ్డూ వేలం - రూ.3.21 లక్షలకు దక్కించుకున్న రిపోర్టర్!
Shadnagar: షాద్‌నగర్ పట్టణంలో ఉత్సాహంగా వినాయకుని లడ్డూ వేలం. రూ.3,21,000 భారీ మొత్తానికి లడ్డూను దక్కించుకున్న ఐన్యూస్ (iNEWS) రిపోర్టర్ శ్రీనివాస్ గుప్త.
Shadnagar: గణేష్ లడ్డూ వేలం - రూ.3.21 లక్షలకు దక్కించుకున్న రిపోర్టర్!
Shadnagar: షాద్‌నగర్ పట్టణంలోని 6వ వార్డులో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరితంగా జరిగింది.
ఈ వేలంలో షాబాద్ మండలం బొబ్బిలి గామ గ్రామానికి చెందిన iNEWS రిపోర్టర్ శ్రీనివాస్ గుప్త రూ.3,21,000కు వినాయకుని లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ గణనాథుని లడ్డూను వేలంలో దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన నిర్వాహకులకు, వేలంలో పాల్గొన్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం భక్తులు “గణపతి బప్పా మోరియా” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6 వ వార్డ్ కౌన్సిలర్ రాజు నాయక్, మాజీ కౌన్సిలర్ లతా శ్రీశైలం గౌడ్, 7వ వార్డ్ కొప్పునూరి ప్రవీణ్ కుమార్, గణేష్ ఉత్సవ నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




