Hyderabad: సోమాజిగూడలో 'జూరీ' తొలి జ్యువెలరీ షోరూమ్ ప్రారంభం!
Hyderabad: హైదరాబాద్లోని సోమాజిగూడలో ప్రముఖ సహజ వజ్రాభరణాల బ్రాండ్ జూరీ తొలి షోరూమ్ ప్రారంభమైంది. ఏడాదిలో 25 స్టోర్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుంది.
Hyderabad: సోమాజిగూడలో 'జూరీ' తొలి జ్యువెలరీ షోరూమ్ ప్రారంభం!
Hyderabad: రెండు దశాబ్దాల ఆభరణాల తయారీ అనుభవంతో సహజ వజ్రాభరణాల బ్రాండ్ జూరీ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టింది. హైదరాబాద్లోని సోమాజిగూడ రాజ్ భవన్ రోడ్డులో తన తొలి షోరూమ్ను ప్రారంభించింది. వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా 25 స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రానున్న మూడు నెలల్లో హైదరాబాద్లో మరో మూడు షోరూమ్లను ప్రారంభించనుంది.
ఆధునిక డిజైన్లతో సహజ వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలను వినియోగదారులకు అందించనుంది. నాణ్యత, పారదర్శకత, కస్టమర్ సేవకు ప్రాధాన్యతనిస్తూ ఉచిత జీవితకాల నిర్వహణ, 20 రోజుల రిటర్న్ పాలసీ వంటి ప్రత్యేక సేవలను అందిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.




