Dundigal: దుండిగల్‌లో ఏరియా 9 ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాలకు భూమిపూజ!

Dundigal: దుండిగల్‌లో రూ.3.50 కోట్లతో నిర్మించనున్న ఏరియా 9 ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ భూమిపూజ చేశారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 19 Oct 2026 2:55 PM IST
Dundigal
X

Dundigal: దుండిగల్‌లో ఏరియా 9 ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాలకు భూమిపూజ!

Dundigal: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని,ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా 9 ముందుకు రావడం అభినందనీయమని మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెసెల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అన్నారు,దుండిగల్ సర్కిల్ కార్యాలయం ముందు నిర్మించనున్న ఏరియా 9 ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి మేడ్చెల్ జిల్లా ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహమ్మద్ తో కలిసి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు,ఇందులో భాగంగా దుండిగల్ సర్కిల్ లో సుమారు మూడు కోట్ల యాభై లక్ష్యలతో చేపట్టనున్న ఏరియా 9 ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణానికి రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా 9 ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR