Ghatkesar: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై అఖిలపక్ష భేటీకి పీసీసీ పిలుపు!
Ghatkesar: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం నాగారంలోని ఎంవీఆర్ ఫంక్షన్ హాల్‌లో అఖిలపక్ష సమావేశం జరగనుంది.
Ghatkesar: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై అఖిలపక్ష భేటీకి పీసీసీ పిలుపు!
ఘట్‌కేసర్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో సమష్టి కార్యాచరణ రూపొందించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ సోమవారం ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్య తీవ్రతను అన్ని రాజకీయ పార్టీలకు వివరించి, అందరి అభిప్రాయాలు, సూచనలతో పరిష్కార మార్గాలను అన్వేషించాలని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
ఇందుకోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. టీపీసీసీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు నవంబరు 3న (మంగళవారం) ఉదయం 11 గంటలకు నాగారంలోని ఎంవీఆర్ ఫంక్షన్ హాల్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు.
ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, డంపింగ్ యార్డ్ సమస్యపై పోరాడుతున్న నాయకులు, మద్దతుదారులు హాజరుకావాలని ఆయన కోరారు. సమస్య పరిష్కారానికి తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసి సమష్టి పోరాటానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




