Jawahar Nagar: బీజేపీ నూతన డివిజన్ కార్యవర్గం నియామకం

Jawahar Nagar: జవహర్ నగర్ డివిజన్ బీజేపీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

PURENDAR, ALWAL
Published on: 14 Nov 2026 8:48 PM IST
Jawahar Nagar
X

Jawahar Nagar: బీజేపీ నూతన డివిజన్ కార్యవర్గం నియామకం

జవహర్ నగర్: జవహర్ నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కళికోట కమలాకర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో డివిజన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల హామీల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

అనంతరం జవహర్ నగర్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా బొమ్మ యాదగిరి, మధ్యబోయిన రాజు, ముచ్చర్ల యాదగిరి; ప్రధాన కార్యదర్శులుగా ఆదిమూలం రాఘవ, పుల్లూరి అనిల్ కుమార్; కోశాధికారిగా కోమాకుల రాజు నియమితులయ్యారు.

వివిధ మోర్చాల అధ్యక్షులుగా యువ మోర్చాకు శాగ అనిల్, మహిళా మోర్చాకు ఇంద్రపాల భవాని, ఓబీసీ మోర్చాకు తేలు శ్రీనివాస్, దళిత మోర్చాకు రామంచ క్రాంతి, గిరిజన మోర్చాకు లావుడ్యా రాంలాల్ నాయక్, కిసాన్ మోర్చాకు సాదరమైన రవి ముదిరాజ్, ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా దుస్స లక్ష్మీనారాయణ నియమితులయ్యారు.

ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా, రాష్ట్ర నాయకులు, మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గం డివిజన్‌లోని ప్రతి బూత్‌లో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని కళికోట కమలాకర్ తెలిపారు.

PURENDAR, ALWAL

PURENDAR, ALWAL