Kushaiguda: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 134వ ఉచిత వైద్య శిబిరం!
Kushaiguda: కుషాయిగూడ చక్రిపురం శ్రీ చక్ర విద్యానికేతన్ హైస్కూల్‌లో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత బీపీ, షుగర్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
Kushaiguda: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 134వ ఉచిత వైద్య శిబిరం!
కుషాయిగూడ: జనవిజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం ఈ నెల 134వ నెల శిబిరం ఆదివారం ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు కుషాయిగూడ లోని చక్రిపురం చౌరస్తాలో ఉన్న శ్రీ చక్ర విద్యా నికేతన్ హై స్కూల్ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కోశాధికారి జెన్నీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి, డాక్టర్ల సలహా మేరకు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
కమలానగర్, ఎ.ఎస్.రావు నగర్, కుషాయిగూడ, చర్లపల్లి, చక్రిపురం, జవహర్ నగర్, జమ్మిగడ్డ, నాగారం, దమ్మాయిగూడ తదితర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు: 9989925997, 8919204421, 9246543662, 9000555075 నంబర్లను సంప్రదించగలరు.




