Talakondapally: పడకల్‌లో ఘనంగా జల్ అర్బన్ దివస్ మొక్కలు నాటిన సర్పంచ్ సునీత
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్‌లో జల్ అర్బన్ దివస్ సందర్భంగా సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
Talakondapally: పడకల్‌లో ఘనంగా జల్ అర్బన్ దివస్ మొక్కలు నాటిన సర్పంచ్ సునీత
Talakondapally: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో జల్ అర్బన్ దివస్‌ను పురస్కరించుకుని వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమాదేవి, గ్రామీణ నీటి సరఫరా విభాగం సహాయ కార్యనిర్వహణ అధికారి ప్రణీత్, ఉపసర్పంచ్ జినుకుంట్ల రాఘవేందర్, వార్డు సభ్యులు, నీటి సరఫరా సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ వ్యవసాయ సహాయకుడు జంగయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.




