Hyderabad: అంతర్రాష్ట్ర ఎండీఎంఏ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి!

Hyderabad: హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ఎండీఎంఏ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన ఈగల్ ఫోర్స్. మియాపూర్ మెట్రో వద్ద నిందితుడి అరెస్ట్.. 14 ఎక్టసీ మాత్రలు, 2 మొబైల్స్ స్వాధీనం.

Rohith
Published on: 18 Sept 2026 9:20 PM IST
Hyderabad
X

Hyderabad: అంతర్రాష్ట్ర ఎండీఎంఏ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి!

హైదరాబాద్: నగరంలో మత్తు పదార్థాల విక్రయాలపై ఈగల్ ఫోర్స్ పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. గోవా, ముంబై కేంద్రాలుగా సాగుతున్న అంతర్రాష్ట్ర ఎండీఎంఏ (MDMA) డ్రగ్ సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించి, ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం... నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పోలా సురేష్ గోపీ అనే వ్యక్తి ముంబైలోని డానిష్ ఆలమ్ అన్సారీ వద్ద ₹22,500 చెల్లించి 29 ఎక్టసీ/MDMA మాత్రలను కొనుగోలు చేశాడు. వాటిలో 15 మాత్రలను ముంబైలోనే విక్రయించిన నిందితుడు, మిగిలిన 14 మాత్రలతో ప్రైవేట్ బస్సులో హైదరాబాద్‌కు చేరుకున్నాడు.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ బృందం, మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టి సురేష్ గోపీని రెండేడ్ చేతులా పట్టుకుంది. అతడి వద్ద నుంచి 9 గ్రాముల బరువు గల 14 ఎక్టసీ మాత్రలతో పాటు 2 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఈ నెట్‌వర్క్‌లో ప్రధాన సూత్రధారులుగా ఉన్న గోవాకు చెందిన 'బాబా', ముంబైకి చెందిన డానిష్ ఆలమ్ అన్సారీ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అధికారులు తెలిపారు. ఘటనపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Rohith

Rohith