Ghatkesar: ఘట్‌కేసర్ సర్కిల్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!
Ghatkesar: ఘట్‌కేసర్ సర్కిల్‌లో శుక్రవారం డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించి 11 మందికి పత్రాలు అందజేశారు.
Ghatkesar: ఘట్‌కేసర్ సర్కిల్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం!
ఘట్‌కేసర్: పేద, మధ్యతరగతి కుటుంబాలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఘట్‌కేసర్ సర్కిల్‌లో శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ ఘట్‌కేసర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వాణిరెడ్డి అధికారులతో కలిసి పథకాన్ని ప్రారంభించి 11 మందికి బీమా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్‌కేసర్, పోచారం, నాగారం, ఎదులాబాద్ నాలుగు డివిజన్లలో రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శనివారం నుంచి సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన 12 కేంద్రాల ద్వారా పథకంలో పేర్లు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఘట్‌కేసర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క ప్రభాకర్‌రెడ్డి, పోచారం అధ్యక్షుడు కర్రె రాజేష్, నాగారం అధ్యక్షుడు భూమయ్య యాదవ్, ఎదులాబాద్ అధ్యక్షుడు సామల అమర్, ఘట్‌కేసర్ డివిజన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి మీసాల సుధాకర్‌రావు, మహిళా అధ్యక్షురాలు అనూజ నాయక్, వివిధ పార్టీల నాయకులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.




