Kadthal: కడ్తాల్‌లో ఘనంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 21 Nov 2026 7:58 AM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్‌లో ఘనంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని శుక్రవారం కడ్తాల్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడ్తాల్, ఆమనగల్ ఉమ్మడి మండలాల సింగిల్ విండో చైర్మన్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాయకంటి బిక్షపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పథకం అమలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై వివరించారు.

కార్యక్రమంలో ఎంపీడీఓ సుజాత, తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY