Pargi: పరిగి, దోమ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు!
Pargi: పరిగి పట్టణం శాంతినగర్, దోమ మండలం లింగనపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి తదితరులు హాజరు.
Pargi: పరిగి, దోమ మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలు!
Pargi: పరిగి పట్టణంలోని శాంతినగర్తో పాటు దోమ మండలం లింగనపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న పరశురాం రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మన్ రజిత వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్ల ప్రారంభోత్సవాల్లో పాల్గొని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరుతుందని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం, నిర్మాణానికి అవసరమైన మార్గదర్శకాలు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ, తమ కుటుంబాలకు భద్రతతో పాటు గౌరవప్రదమైన జీవనం లభించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమాల్లో రాకుంచెర్ల పెంటయ్య ,స్థానిక కౌన్సిలర్లు, ఆత్మ డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




