Kukatpally: కూకట్‌పల్లిలో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు!

Kukatpally: కూకట్‌పల్లి బస్‌స్టాప్ వద్ద గురువారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కావేటి నాగార్జున ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Maruthisagar, Kukatpally
Published on: 19 Nov 2026 5:25 PM IST
Kukatpally
X

Kukatpally: కూకట్‌పల్లిలో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు!

కూకట్‌పల్లి: డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కావేటి నాగార్జున ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 109వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కూకట్‌పల్లి బస్‌స్టాప్ వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ఇందిరా గాంధీ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కుల వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల జశ్వంత్ రావు, గూడెపు నాగరాజు, జ్యోతి, కృష్ణవేణి, గండి మల్లేష్, మేకల మహేష్, కొమ్ము బబ్బు, రాజు, సతీష్, వినయ్ గౌడ్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally