Hyderabad: కేఎల్‌హెచ్‌లో భారత్‌లోనే తొలి ‘ఏజెంటిక్ ఏఐ క్యాంపస్’ కార్యక్రమం!

Hyderabad: హైదరాబాద్ కేఎల్‌హెచ్‌లో హెచ్‌సీఎల్ ఏఐ ల్యాబ్స్ భాగస్వామ్యంతో దేశంలోనే తొలి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు అత్యాధునిక శిక్షణ అందనుంది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 5 Oct 2026 4:29 PM IST
Hyderabad
X

Hyderabad: కేఎల్‌హెచ్‌లో భారత్‌లోనే తొలి ‘ఏజెంటిక్ ఏఐ క్యాంపస్’ కార్యక్రమం!

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని కేఎల్‌హెచ్‌లో భారతదేశపు మొట్టమొదటి ఏజెంటిక్ ఏఐ క్యాంపస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. KLH హైదరాబాదు క్యాంపస్‌లో మొట్టమొదటి సారిగా భారతదేశపు ఏజెంటిక్ ఏఐ కార్యక్రమం జరిగింది. విద్యార్థుల అభ్యసనంలోకి అత్యాధునిక ఏజెంటిక్ ఏఐ సాంకేతికతను తీసుకురావడంతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విద్యార్థులను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో , హెచ్‌సీఎల్ గ్రూప్ ఏఐ ల్యాబ్స్‌తో కలిసి కేఎల్, కేఎల్‌హెచ్ సంస్థలు వ్యూహాత్మక సహకారాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్‌ను ప్రపంచ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యా నైపుణ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, పరిశ్రమ అవసరాలను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని, కేఎల్, కేఎల్‌హెచ్ మరియు హెచ్‌సీఎల్ గ్రూప్ ఏఐ ల్యాబ్స్ మధ్య ఏర్పడిన వ్యూహాత్మక భాగస్వామ్యంతో విద్యార్థులకు ఏజెంటిక్ ఏఐపై ఆధునిక శిక్షణ, పరిశోధన, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం అందించనున్నారు.. ఏజెంటిక్ ఏఐ రంగంలో విద్యార్థులకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కేఎల్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. పార్థసారథి వర్మ, డీన్ – స్కిల్ డెవలప్‌మెంట్ డాక్టర్ ఎ.ఎస్.ఎ. శ్రీనాథ్, కేఎల్‌హెచ్ అజీజ్‌నగర్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే హెచ్‌సీఎల్ గ్రూప్ నుంచి శ్రీ దీపక్ సర్వనన్, ఏవీపీ – నేషనల్ హెడ్, ఏఐ ల్యాబ్స్; శ్రీ గౌతమ్ రాజ్, సీనియర్ మేనేజర్; శ్రీ హరన్ డే, సీనియర్ మేనేజర్ తదితరులు హాజరయ్యారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR