Vikarabad: వికారాబాద్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ!
Vikarabad: వికారాబాద్‌లో ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ పేరిట ఓట్ల తొలగింపును నిరసిస్తూ కాంగ్రెస్, ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
Vikarabad: వికారాబాద్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ!
Vikarabad: SIR ప్రక్రియ పేరుతో అర్హులైన ప్రజల ఓటు హక్కుకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి పార్టీలతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ (DCC) అధ్యక్షులు జాదవ్ ధారాసింగ్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పరిగి ఎమ్మెల్యే మరియు SIR శిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ టి. రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డితో పాటు CPI పీర్ మహమ్మద్, CPI(M) మహిపాల్, CPI (ML) మహేందర్ , TJS సోమ శేఖర్, కోడంగల్ SIR అసెంబ్లీ కోఆర్డినేటర్ మాణిక్యం మల్లేష్ యాదవ్,పార్టీల జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
NTR చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ BJR చౌరస్తా మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు “ఓటు బచావో – దేశ్ బచావో” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీ నాయకులు మాట్లాడుతూ మాట్లాడుతూ “ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా అన్యాయంగా తొలగించబడకూడదు. SIR ప్రక్రియలో ప్రజలకు పూర్తి సమాచారం అందించి, అభ్యంతరాలు మరియు ఆధారాలు సమర్పించుకునే అవకాశం కల్పించాలి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలి.”
అర్హులైన ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. కొత్తగా అర్హత పొందిన ఓటర్లు నమోదు చేసుకోవాలని, ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని సూచించారు.
ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగ హక్కులను కాపాడే ప్రజా ఉద్యమమని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని జాదవ్ ధారాసింగ్ నాయక్ స్పష్టం చేశారు.




