Tandur: తాండూరులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అధికారుల అండ?
Tandur: తాండూరు కాగ్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అధికారుల అండదండలతోనే ఈ చీకటి దందా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Tandur: తాండూరులో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అధికారుల అండ?
Tandur: ఇసుక అక్రమ రవాణా నిరోధించాల్సిన కొందరు అధికారులు మాఫియాతో కుమ్మక్కై ముడుపులు అందుకుంటున్నారనే ఆరోపణలు తాండూరులో వస్తున్నాయి. తాండూరు కాగ్నా నది నుండి చీకటి దందా రోజు రోజుకు మితిమీరిపోతుంది. అక్రమార్కులు ప్రతి రోజూ యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. రాత్రి సమయాలలో అక్రమంగా ఇసుక తరలి వెళ్తుంది. తనిఖీ చేయాల్సిన ఆయా శాఖల(రెవిన్యూ, మైనింగ్, పోలీసు)సిబ్బందికి ముడుపులు అందుతున్నట్లు విమర్శలున్నాయి. గతంలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినప్పటికీ ఇసుక మాఫియా తన కోరలు చాస్తూనే ఉంది.
అనుమతులు ఒక ప్రాంతానికి తీసుకుని, వేరే ప్రాంతాల నుంచి అనధికారికంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక దందా ఆగకపోవడంతో అధికారులు ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలలో నిజం ఉందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఎవరైనా సమాచారం అందిస్తే వారి వివరాలు నేరుగా ఇసుక మాఫియాకు అందజేస్తున్నారని, ఇసుక మాఫియా వారితో గొడవకు దిగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వార్తలు వచ్చినప్పుడు అధికారులు కంటి తుడుపు చర్యగా కొన్ని వాహనాలను పట్టుకొని నామమాత్రపు జరిమానాలు విధించి వదిలేస్తూ ఇసుక అక్రమ రవాణాకు అధికారులు అండగా నిలుస్తున్నారని మండల ప్రజలు ఆరోపణచేస్తున్నారు. కొంతకాలం కిందట ఇసుక మాఫియా అర్ధరాత్రి సమయంలో ఒకటి, రెండు వాహనాలలో నేరుగా వాగులోకి వెళ్లి ఇసుక అక్రమంగా తరలించేవారు. కానీ ప్రస్తుతం కొంతమంది అధికారుల అండతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది.అక్రమ దందానే ఇంత బహిరంగంగా చేయడంతో అధికాలకు మామ్ముళ్ల మరకలు అంటుకుంటున్నాయి.
కొంత మంది అధికారులు నేరుగా ఇసుక మాఫియాతో వాహనం లెక్కన నెలకు ఇంత అంటూ వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. విషయం తెలిసినా కొంత మంది అధికారులు మాత్రం మనకెందుకులే ఈ వ్యవహారం అని నిమ్మకునిరేత్తినట్లు ఉండడంతో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నది. ఈ విషయంపై ఉన్నతాధికారులు అయినా కలుగజేసుకొని ఇసుక అక్రమ రవాణాను అరికట్టడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.




