Hyderabad: హెచ్ఎంఆర్ఎల్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన బి. అజిత్ రెడ్డి!
Hyderabad: బేగంపేట మెట్రో రైల్ భవన్‌లో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీగా ఐడీఈఎస్ అధికారి బి. అజిత్ రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.
Hyderabad: హెచ్ఎంఆర్ఎల్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన బి. అజిత్ రెడ్డి!
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)కి పూర్తి అదనపు బాధ్యతలతో మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులైన బి.అజిత్ రెడ్డి ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. బేగంపేట్ మెట్రో రైల్ భవన్ లో అజిత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు హెచ్ఎంఆర్ఎల్ అదనపు ఎండీ గా ఉన్న ఆయనను ఎండీ గా నియమిస్తూ నిన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం శ్రీ అజిత్ రెడ్డి ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐడీఈఎస్ అధికారి అయిన అజిత్ రెడ్డి గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓగా, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా పని చేసారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టడానికి మెట్రో రైల్ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువకు తీసుకెళ్లడానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా ఆయన అన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థను మరింత విస్తరించడానికి ఉన్న ప్రణాళికలు సఫలీకృతం అయ్యేలా పటిష్టమైన చర్యలు చేపడతానని తెలిపారు. కొత్తగా ఎండీ బాధ్యతలు చేపట్టిన అజిత్ రెడ్డి ని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.




