Abdullapurmet: నగర శివారులో అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపాలి: ఎమ్మెల్యే మల్‌రెడ్డి!

Abdullapurmet: నగర శివారులో అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టాలి ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆదేశం హయత్‌నగర్‌లో అబ్దుల్లాపూర్‌మెట్ అధికారులతో శాంతిభద్రతలు, విద్యుత్‌పై సమీక్ష.

AJAY, HAYATH NAGAR
Published on: 29 Sept 2026 6:52 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: నగర శివారులో అక్రమ దందాలపై ఉక్కుపాదం మోపాలి: ఎమ్మెల్యే మల్‌రెడ్డి!

అబ్దుల్లాపూర్మెట్: అబ్దుల్లాపూర్మెట్ నగర శివారులో అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు, అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.

హయత్‌నగర్‌లోని మండల పరిషత్‌ కార్యాలయంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో శాంతిభద్రతలు, విద్యుత్‌ సరఫరా, ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు.

నగర శివారులో చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైన చోట తగిన పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. అదనపు సిబ్బంది అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు.

రైతులకు విద్యుత్‌ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్‌ అధికారులు చర్యలు చేపట్టాలని మల్‌రెడ్డి రంగారెడ్డి సూచించారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలు, ఇతర సామగ్రి అవసరమైతే తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం లేదా జాప్యం ప్రదర్శించవద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR