Ibrahimpatnam: లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Ibrahimpatnam: మంచాల మండలం ఆంబోత్ తండా, బండాలెమూర్ గ్రామాలలో ముగ్గురు లబ్ధిదారులకు రూ.1.39 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మర్రి నిరంజన్ రెడ్డి అందజేశారు.
Ibrahimpatnam: లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఇబ్రహీంపట్నం: పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గించి, ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా అందిస్తున్న సహాయం నిరుపేదలకు ఎంతో ఉపయోగకరంగా మారుతోందని టీపీసీసీ సభ్యులు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం ఆంబోత్ తండా, బండాలెమూర్ గ్రామాలకు వెళ్లిన ఆయన, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మంజూరైన చెక్కుల వివరాలు ఇలా ఉన్నాయి.
1. రాట్ల తర్యా – ఆంబోత్ తండా – రూ.60,000
2. నేనావత్ బిచ్య – ఆంబోత్ తండా – రూ.26,000
3. పాత్లోత్ నిల – బండాలెమూర్ – రూ.53,500
మొత్తం రూ.1,39,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ముగ్గురు లబ్ధిదారులకు అందజేశారు.




