Hyderabad: టెలిఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం.. యువకుడిని రక్షించిన హైడ్రా!

Hyderabad: దోమలగూడ గాంధీనగర్‌లో టెలిఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన అనంతపురం యువకుడిని హైడ్రా డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు సురక్షితంగా కిందకు దించి రక్షించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 29 Nov 2026 10:33 AM IST
Hyderabad
X

Hyderabad: టెలిఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం.. యువకుడిని రక్షించిన హైడ్రా!

Hyderabad: టెలిఫోన్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని హైడ్రా కాపాడింది. దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

అనంతపురం జిల్లాకు చెందిన భాష(28) గాంధీనగర్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. రకరకాల కారణాలతో మనస్థాపానికి గురై.. తీవ్ర నిరాశలో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గాంధీనగర్లో టెలిఫోన్ టవర్ ఎక్కాడు.

అక్కడివారు నచ్చజెప్పి కిందకు దించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. యిదే విషయాన్ని హైడ్రా కంట్రోల్ రూంకు రాత్రి 11.20 గంటలకు ఫోన్ చేసి చెప్పారు. హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్ ఘటనా స్థలానికి 11.30 గంటలకు చేరుకొని... ఒకవైపు యువకుడితో మాట్లాడుతూనే.. మరోవైపు టవర్ ఎక్కి కాపాడేందుకు ప్రయత్నించారు.

దోమలగూడ S.I. శ్రీనివాస్, DRF టీమ్ 15 సభ్యులతో కలసి సూపర్ వైజర్ శ్రీనివాస్ టవర్ పైకి ఎక్కిన వారిలో ఉన్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భాషా ను కిందకు దించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత దోమలగూడ పోలీసులకు అప్పగించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్