Hyderabad: కుంట్లూరు బట్ల బాయ్ కుంటలో హైడ్రా ఆధ్వర్యంలో ఫెన్సింగ్ పనులు!
Hyderabad: హైదరాబాద్ పెద్ద అంబర్‌పేట్ డివిజన్ పరిధిలోని కుంట్లూరు బట్ల బాయ్ కుంటను ఆక్రమణల నుంచి కాపాడేందుకు హైడ్రా అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు,బందోబస్తు నిర్వహించారు.
Hyderabad: కుంట్లూరు బట్ల బాయ్ కుంటలో హైడ్రా ఆధ్వర్యంలో ఫెన్సింగ్ పనులు!
Hyderabad: పెద్ద అంబర్‌పేట్ డివిజన్ పరిధిలోని కుంట్లూరు బట్ల బాయ్ కుంటను హైడ్రా అధికారులు పరిరక్షిస్తున్నారు. కుంటకు సంబంధించిన ఒక ఎకరం 9 గుంటల భూమిని హైడ్రా అధికారులు కాపాడుతూ, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కుంట వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైడ్రా అధికారులు, పోలీసులు పర్యవేక్షణలో ఫెన్సింగ్ పనులు కొనసాగుతున్నాయి.




