Hyderabad: మాదాపూర్‌లో త్రుటిలో తప్పిన ప్రమాదం
Hyderabad: మాదాపూర్ విటల్ రావు నగర్‌లో భారీ వర్షం కారణంగా తెరచుకున్న నాళాలో పడిన జెప్టో డెలివరీ బాయ్ అర్జున్ కుమార్‌ను పోలీసులు, NDRF సిబ్బంది రక్షించారు.
Hyderabad: మాదాపూర్‌లో త్రుటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్: మాదాపూర్ విటల్ రావు నగర్‌లో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఒక్క సారిగా కురిసిన భారీ వర్షానికి రహదారిపై వరద నీరు భారీగా ప్రవహించింది.
ఈ క్రమంలో రహదారి పై వెళ్తున్న 'జెప్టో' డెలివరీ బాయ్ ఘంటసాల అర్జున్ కుమార్, వరద నీటి తీవ్రతకు తట్టుకోలేక తన ద్విచక్ర వాహనంతో సహా పక్కనే ఉన్న తెరచుకున్న నాళాలోకి కొట్టుకుపోయాడు.
స్థానికులు వెంటనే ఇచ్చిన సమాచారంతో స్పందించిన పోలీసులు మరియు NDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.డెలివరీ బాయ్ అర్జున్ కుమార్‌ను నాళా నుంచి సురక్షితంగా బయటకు తీశారు.
బాధితుడు సురక్షితంగా బయటపడటంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అతడి ద్విచక్ర వాహనం మాత్రం వరద నీటిలోనే చిక్కుకుపోయింది.




