Hyderabad: ఐఎస్ సదన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మహిళ దుర్మరణం
Hyderabad: హైదరాబాద్ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీహెచ్‌ఎంసీ చెత్త తరలింపు ఆటో ఢీకొని సువర్ణ అనే మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై ధర్నాకు దిగారు.
Hyderabad: ఐఎస్ సదన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: మహిళ దుర్మరణం
Hyderabad: ఐఎస్ సదన్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై వెళ్తున్న సువర్ణ అనే మహిళను జీహెచ్‌ఎంసీకి చెందిన చెత్త తరలింపు ఆటో అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఆమె తీవ్ర రక్తగాయాలపాలై కుప్పకూలిపోయిన వైనం..
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అత్యంత విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచిన దృశ్యం కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది..
నిరుపేద కుటుంబానికి ఆధారమైన మహిళ అన్యాయంగా కళ్లెదుటే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు మృతదేహంతో ఐఎస్ సదన్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, రంగంలోకి దిగిన ఐఎస్ సదన్ పోలీసులు ఆందోళనకారులకు న్యాయం చేస్తామని సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన తీరు.




