Hyderabad: మల్లారెడ్డి యూనివర్సిటీలో మూవీ ప్రమోషన్లపై విచారణ జరపాలి VJS

Hyderabad: మల్లారెడ్డి యూనివర్సిటీలో మూవీ ప్రమోషన్లపై సమగ్ర విచారణ జరిపి గుర్తింపు రద్దు చేయాలని విద్యార్థి జన సమితి (VJS) డిమాండ్. విద్యామండలికి వినతిపత్రం.

G. Govind
Published on: 30 Oct 2026 5:42 PM IST
Hyderabad
X

Hyderabad: మల్లారెడ్డి యూనివర్సిటీలో మూవీ ప్రమోషన్లపై విచారణ జరపాలి VJS

Hyderabad: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ఉన్నత విద్యాసంస్థలను సినిమా ప్రమోషన్ల వేదికలుగా మార్చడం ఎంతవరకు సమంజసమని విద్యార్థి జన సమితి (VJS) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జిల్లపల్లి దిలీప్ కుమార్ ప్రశ్నించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన మూవీ ప్రమోషన్లు, అనంతరం సెలవు ప్రకటించిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇటీకల పురుషోత్తం గారికి VJS తెలంగాణ నాయకులు వినతిపత్రం సమర్పించారు. యూనివర్సిటీలో జరిగిన పరిణామాలపై వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, UGC నిబంధనలు, విశ్వవిద్యాలయ మార్గదర్శకాలు, విద్యార్థుల హక్కుల ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా అనే అంశాలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరారు.

విద్యార్థుల విద్యా ప్రయోజనాల కంటే వాణిజ్యపరమైన ప్రచారాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆందోళనకరం. విద్యాసంస్థలు తమ ప్రాథమిక బాధ్యతలను విస్మరించకుండా విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇవ్వాలని దిలీప్ కుమార్ స్పష్టం చేశారు. విచారణలో చట్టవిరుద్ధమైన చర్యలు, నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ పాటు, తగిన ఆధారాలు ఉన్న సందర్భంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే చర్యలను విద్యార్థి జన సమితి(VJS), సహించబోదని, ఉన్నత విద్యారంగంలో జవాబుదారీతనం, పారదర్శకతను పెంపొందించే వరకు విద్యార్థుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని జిల్లాపెల్లి దిలీప్ కుమార్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి జన సమితి (VJS) రాష్ట్ర కార్యదర్శి జిల్లపల్లి దిలీప్ కుమార్‌ తో పాటు రాష్ట్ర కమిటీ నాయకులు డప్పు గోపీ పాల్గొన్నారు.

G. Govind

G. Govind