Hayathnagar: హయత్‌నగర్ తారామతిపేట్‌లో ఘనంగా గణనాథుడి లడ్డూ వేలం పాట

Hayathnagar: హయత్‌నగర్ తారామతిపేట్‌లో ఘనంగా గణపతి లడ్డూ వేలం. రూ. 61,116లకు లడ్డూను దక్కించుకున్న రిటైర్డ్ ఉద్యోగి నరసింహ గౌడ్.

AJAY, HAYATH NAGAR
Published on: 24 Sept 2026 10:17 PM IST
Hayathnagar
X

Hayathnagar: హయత్‌నగర్ తారామతిపేట్‌లో ఘనంగా గణనాథుడి లడ్డూ వేలం పాట

హయత్‌నగర్: తారామతిపేట్‌లో హరి హరి శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుడి లడ్డూకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఎరుకల నరసింహ గౌడ్ రూ. 61,116లకు గణనాథుడి లడ్డూను దక్కించుకున్నారు.

అనంతరం హరి హరి శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసింహ గౌడ్‌ను ఘనంగా సత్కరించారు. లడ్డూ వేలంపాటలో భక్తులు, నిర్వాహకులు ఉత్సాహంగా పాల్గొని, వేలం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR