Hyderabad: హైదరాబాద్‌లో భారీ హనీట్రాప్ గుట్టురట్టు నిందితుడు పవన్ అరెస్ట్

Hyderabad: హైదరాబాద్‌లో భారీ హనీట్రాప్ కేటుగాడి అరెస్ట్. ఫేక్ ఐడీలతో 82 మందిని బెదిరించి రూ. 25.16 లక్షలు వసూలు చేసిన పవన్ కుమార్‌ను అరెస్ట్ చేసిన సైదాబాద్ పోలీసులు.

SYED MUJTABA HUSSAIN, OLD CITY
Published on: 19 Oct 2026 4:12 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో భారీ హనీట్రాప్ గుట్టురట్టు నిందితుడు పవన్ అరెస్ట్

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన భారీ హనీట్రాప్ వ్యవహారం. ఫేక్ సోషల్ మీడియా ఖాతాలతో యువకులకు వల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలతో బెదిరింపులు. హనీట్రాప్ నిందితుడు కొండభత్తుల పవన్ కుమార్ అరెస్ట్. రూ.18 లక్షలు బెదిరింపులతో వసూలు చేసినట్లు ఆరోపణ..

మరో రూ.7.16 లక్షలు మోసం చేసినట్లు పోలీసుల వెల్లడి. మొత్తం రూ.25.16 లక్షల మేర మోసం, వసూళ్లు 82 మంది ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు పంపినట్లు గుర్తింపు. 13 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్, 14 ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు.

రెండు వాట్సాప్ ఖాతాలు, మూడు బ్యాంకు ఖాతాల వివరాలు గుర్తింపు. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన బాధితులు కూడా ఉన్నట్లు వెల్లడి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ సహా పలు వస్తువులు స్వాధీనం. సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 358/2026 కింద కేసు

SYED MUJTABA HUSSAIN, OLD CITY

SYED MUJTABA HUSSAIN, OLD CITY